• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం ..  8 ఫైరింజిన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
Crime

కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం .. 8 ఫైరింజిన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (19/6/19.. 09.30am)

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మెయిన్‌ రోడ్‌లోని సర్వాని సూపర్‌ మార్కెట్‌లో బుధవారం వేకువ జామున 4 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతం కారణంగా చెలరేగిన మంటలు భవనంలోని మూడు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.2 కోట్ల వరకూ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఎనిమిది అగ్నిమాపక శకటాలతో మంటలార్పుతున్నారు. మంటల తీవ్రత భారీగా ఉండటంతో పెద్దాపురం, పిఠాపురం నుంచి నాలుగు అగ్నిమాపక శకటాలను తరలించినట్లు అధికారులు వెల్లడించారు. భవనం ఇరుకు ప్రాంతంలో ఉండడం వల్ల చుట్టు పక్కలకు వెళ్లే వీలు లేకుండా ఉందని, ముందు నుంచే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ భవనానికి ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవని  తెలిపారు. సూపర్‌ మార్కెట్‌లో ప్లాస్టిక్‌ వస్తులు, స్కూల్‌ బ్యాగులు, దుస్తులు ఉండడంతో మంటల తీవ్రత బాగా పెరిగిందని అధికారులు అంచనా వేశారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కాణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి రత్నబాబు తెలిపారు.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work